- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీజేపీతో టచ్‌లో వైసీపీ ఎమ్మెల్యే.. క్లారిటీ ఇచ్చిన మల్లాది
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గం ఇంచార్జిగా వెల్లంపల్లి శ్రీనివాస్‌ను సీఎం జగన్ నియమించినప్పటి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. దీంతో ఆయన శుక్రవారం స్పందించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడారు. బీజేపీతో టచ్‌లో ఉన్నాననేది అవాస్తవమని మల్లాది విష్ణు కొట్టిపారేశారు. ఐదేళ్లుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు చేస్తున్నానని, ఈసారి ఎన్నికల్లో సీటు కేటాయించకపోయినా తాను అసంతృప్తిగా లేనని చెప్పారు. వైసీపీలోనే కొనసాగుతానని, సీఎం జగన్ వెంటే నడుస్తానని మల్లాది విష్ణు పేర్కొన్నారు. దుష్ప్రచారాలను వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు నమ్మొద్దని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని మల్లాది విష్ణు తెలిపారు.