- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Vijayawada: టీడీపీ నేత వినోద్ కుమార్ జైన్‌కు జీవితకాల శిక్ష
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేత వినోద్ కుమార్ జైన్‌కు జీవిత కాల శిక్ష పడింది. 2022లో భవానీపురంలో బాలిక ఆత్మహత్య చేసుకున్నారు. లైంగిక వేధింపులు తాళ్లలేక అపార్ట్ మెంట్ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే బాలిక ఆత్మహత్యకు వినోద్ జైన్ లైంగిక వేధింపులే కారణమని ఈ కేసు విచారణలో పోలీసులు నిర్ధారించారు. అనంతరం కోర్టుకు ఫైనల్ చార్జిషీట్ దాఖలు చేశారు.
ఈ కేసును సుధీర్ఘంగా విచారించిన విజయవాడ పోక్సో కోర్టు ధర్మాసనం.. వినోద్ జైన్‌కు జీవితకాలం శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు రూ.3 లక్షలు జరిమానా సైతం విధించింది. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. కోర్టు తీర్పుతో పోలీసులు ఆయనను జైలుకు తరలించనున్నారు. అయితే విజయవాడ కోర్టు తీర్పుపై వినోద్ కుమార్ జైన్ హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story