- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Devineni: ఆ నిధులు మళ్లించారు.. కేంద్రం నిధులపై సంచలణ వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: పోలవరం ప్రాజెక్టు పూర్తిపై వైసీపీ, టీడీపీ మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. టీడీపీ హాయంలో పోలవరం ప్రాజెక్టు పనులు చకచకా జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులు మెల్లగా సాగుతున్నాయి. అయితే టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనుల్లో తప్పిదాలు జరిగాయని, అందుకే పనులు ఆలస్యమవుతున్నాయని వైసీపీ మంత్రులు చెబుతున్నారు. దీంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులను మళ్లించారని ఆరోపిస్తున్నారు.
తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ ‘మా ప్రభుత్వ హయాంలో 70 పనులు జరిగాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు అసలు జరగడంలేదు. జగన్ బంధువుతో కమిటీ వేసి మాపై బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ఏజెన్సీని మార్చారు. మా హయాంలో చేసిన పనులకు కేంద్రం రూ.6 వేల కోట్ల నిధులు ఇచ్చింది. వైసీపీ హయాంలో కూడా నిధులు ఇచ్చింది. కేంద్రం ఇస్తున్న నిధులను ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టడం లేదు. ఎక్కడికి మళ్లించారో చెప్పాలి.’ అని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.