- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
Pamarru Ycp Mla నివాసంలో భారీ చోరీ

- క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ ఎమ్మెల్యే నివాసంలో చోరీ ఒక్కసారిగా కలకలం రేపింది. కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ నివాసంలో భారీ చోరీ జరిగింది. బాపులపాడు మండలం శేరినరసన్నపాలెం ముందడుగు కాలనీలో అనిల్ కుమార్ నివాసం ఉంది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. పని మనిషి ఇంటికి వచ్చి చూడగా ఇంటిలోని వస్తువులను చెల్లాచెదురుగా పడవేసి ఉన్నాయి. దీంతో ఆమె ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌కు తెలిపార. ఈ మేరకు వీరవల్లి పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో గన్నవరం డీఎస్పీ విజయ్ పాల్ క్లూస్ టీంతో రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఇంట్లో తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. అయితే పదిహేను రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన దొంగలు దోపిడీకి పాల్పడ్డారు.