Ntr District: నలుగురు మధ్య వివాదం.. వ్యక్తి దారుణ హత్య

by srinivas |   ( Updated:15 March 2025 5:54 PM  )
Ntr District: నలుగురు మధ్య వివాదం.. వ్యక్తి దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా(NTR District ) ఇబ్రహీంపట్నం ఫెర్రీ(Ibrahimpatnam Ferry)లో దారుణం జరిగింది. నలుగురు మధ్య వివాదం(Dispute) చెలరేగింది. దీంతో ఘర్షణ(Clash) పడ్డారు. పరస్పరం రాళ్లతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో వెంకట్ అనే యువకుడు మృతి చెందారు. అనంతరం మిగిలిన ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు.

అయితే పోలీసులకు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు వెంకట్ కంచికచర్ల వాసిగా గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. వెంకట్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సీసీ టీవీ ఫుటేజులను పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. త్వరగా కేసును ఛేదించి నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. మరోవైపు వెంకట్ బంధువులు ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

READ MORE ...

చిన్న పాటి గొడవ.. ఓ యువకుడిపై కత్తిపోట్లకు దారితీసింది..


Advertisement
Next Story