- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ప్రియురాలి కోసం భార్యను మార్చేసిన భర్త?'
దిశ, పెనమలూరు : రెండో పెళ్లి మోజులో పడి భర్త డాక్టర్ భానుమర్తి తన పిల్లలను, తనను దూరం పెట్టాడని భార్య శిరీష ఆరోపించారు. ఇందులో భాగంగానే కృష్ణ జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యురులోని విశ్వాశాంతి విద్యా సంస్థల్లో తన బిడ్డ అడ్మిషన్‌లో తల్లిగా తన పేరు కాకుండా ప్రియురాలి పేరు చేర్చారని మండిపడ్డారు. అంతే కాకుండా తనను చంపుతానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. రెండో పెళ్లి మోజులో పడిన తన భర్త తనను, పిల్లలను వేరు చేసి తమ జీవితంతో ఆడుకుంటున్నాడని వాపోయింది. తన భర్త కోసం కళ్యాణదుర్గం రోడ్డుపై నిరసన తెలిపానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు.
2003లో తనకు కళ్యాణదుర్గంకు చెందిన ప్రభుత్వ కంటి వైద్య నిపుణుడు భానుమూర్తితో పెళ్లి జరిగిందని శిరీష చెప్పారు. 19 ఏళ్లుగా తమ జీవితం సాఫీగా సాగి ఇద్దరు పిల్లలు పుట్టారని, కానీ 2013 నుంచి తన భర్త వేధించడం మొదలు పెట్టాడని ఆరోపించారు. ఈ క్రమంలో కళ్యాణదుర్గానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనపై లేనిపోని అబాండాలు వేశాడన్నారు. రెండేళ్లుగా తనను గృహనిబంధం చేసి తనకు మానసికంగా జబ్బు ఉందని విపరీతమైన మాత్రలు మింగించి విడాకులపత్రంపై సంతకం పెట్టించుకున్నాడని ఆరోపించారు. అనంతపురం ప్రభుత్వ వైద్యశాలలో కంటి వైద్య నిపుణుడిగా పనిచేస్తున్న భానుమూర్తి తన నుండి దూరం కావాలని ఇటీవల మచిలీపట్నంకు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడని ఆరోపించింది. కళ్యాణదుర్గానికి చెందిన ఓ మహిళను ఆమె భర్త నుంచి వేరుచేసి విజయవాడలో కాపురం పెట్టాడని, ఇది తెలుసుకొని తనకు న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. పోలీసులు తనకు న్యాయం చేయాలని, పిల్లలను తన దగ్గరకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.