- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పవన్ కల్యాణ్ విషయంలో నా అంచనా తప్పు అయ్యేలా ఉంది: MP
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు మినహా దాదాపు ప్రశాంతంగా ముగిశాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై పడింది. అధికారమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేయగా.. వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. మరోవైపు కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. ఈ క్రమంలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ సరళిని చూసి తన అభిప్రాయం మార్చుకుంటున్నట్లు తెలపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 150కిపైగా స్థానాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు.
పక్కాగా టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క గెలుపే కాదని మెజారిటీ విషయంలోనూ తన అంచనాలు మార్చుకుంటున్నట్లు చెప్పారు. నెల క్రితం పవన్ కల్యాణ్‌కు పిఠాపురంలో 50 వేల పైచిలుకు మెజార్టీ వస్తుందని అనుకున్నా. కానీ, ఆ విషయంలో నా అంచనా తప్పు అయ్యేలా ఉంది. 65 వేలకు పైగానే వచ్చే అవకాశం ఉంది. పిఠాపురంలోని కొన్ని పోలింగ్ బూత్‌లలో 80శాతం పవన్ కల్యాణ్‌కు అనుకూలంగానే ఓటింగ్ జరిగిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఇక చంద్రబాబు కూడా కుప్పంలో 60వేలకుపైగా మెజారిటీతో గెలుస్తారన్నారు.