- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Open Letter: పవన్‌కు మళ్లీ అదే సలహా..!
దిశ, వెబ్ డెస్క్: జననేత అధినేత పవన్ కల్యాణ్‌కు కాపు సంక్షేమ సంఘం నేత హరిరామ జోగయ్య మళ్లీ అదే సలహా ఇచ్చారు. పొత్తులో అధికారంలోకి వస్తే రెండున్నరేళ్లు జనసేనకు ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు కోరారు. అంతేకాదు ఆ విషయాన్ని స్వయంగా చంద్రబాబుతోనే ప్రకటించాలని సూచించారు. తాజాగా కూడా హరిరామజోగయ్య ఇదే డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సోమవారం బహిరంగ లేఖ రాశారు. పొత్తుల్లో భాగంగా టీడీపీ నుంచి 40 నుంచి 50 సీట్లు డిమాండ్ చేయాలని తెలిపారు. అంతేకాదు అధికారంలోకి వస్తే చెరో రెండున్నర ఏళ్లు పాలించాలని లేఖలో పేర్కొన్నారు. సీఎం జగన్‌ను ఓడించడమంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కాదని సూచించారు. చంద్రబాబును సీఎం చేయడానికి పవన్ కల్యాణ్ వెంట కాపులు నడవటం లేదని తెలిపారు. దామాషా ప్రకారం సీట్లు కేటాయింపులు జరగాలన్నారు. అప్పుడే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలుగుతారని తెలిపారు. అలా కాదని 20-30 సీట్ల కోసమైతే జనసేన భారీగా నష్టం చవిచూడాల్సి వస్తుందన్నారు. అటు చంద్రబాబు కూడా కాపుల అభివృద్ధికి పాటు పడాలని హరిరామజోగయ్య లేఖలో సూచించారు.
Read More..