Mudragada Padmanabham : ముద్రగడకు వైసీపీ గాలం

by Javid Pasha |   ( Updated:2023-06-09 11:02:36.0  )
Mudragada Padmanabham :  ముద్రగడకు వైసీపీ గాలం
X

దిశ, డైనమిక్ బ్యూరో : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో వైసీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. కాపు ఉద్యమ సమయంలో చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో తమ సామాజిక వర్గానికి చెందిన యువకులపై కేసులు కొట్టివేయడం.. కోర్టు సైతం కేసును కొట్టేయడంతో ఆయన ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వైసీపీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ఇదే సమయంలో ప్రత్తిపాడు నుంచి ముద్రగడ పద్మనాభం లేదా ఆయన తనయుడుని వైసీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయిస్తారనే ప్రచారం జరిగింది. ఇలాంటి తరుణంలో ముద్రగడ పద్మనాభంతో వైసీపీ కాపు నేతలు భేటీ అయ్యారు.

కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లిన నేతలు ఆయనతో అల్పాహార విందు సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పలువురు ఎంపీపీలు, కాపు నేతలు వీరిలో ఉన్నారు. ఈ విందు రాజకీయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వీరిమధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. మరోవైపు ఈనెల 14 నుంచి వారాహి యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇలాంటి తరుణంలో పవన్ కల్యాణ్‌ను దెబ్బకొట్టేందుకు ముద్రగడకు వైసీపీ గాలం వేస్తుందనే ప్రచారం జరుగుతుంది.

Next Story

Most Viewed