- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టీడీపీ పగ్గాలు.. ఇంచార్జిగా నియామకం
దిశ,వెబ్‌డెస్క్: సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జ్‌గా కన్నా లక్ష్మీనారాయణను నియమించారు. కొద్దినెలల క్రితం బీజేపీని వీడి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీ ఈ పదవి కట్టబెట్టింది. ఇన్నాళ్లూ మూడు నియోజకవర్గాల చుట్టూ కన్నా పేరుపై చర్చ జరిగింది. చివరకు సత్తెనపల్లి పగ్గాలు కన్నాకు అప్పగించింది. సత్తెనపల్లిలో టీడీపీ ఇంచార్జ్ పోస్టు కోసం పలువురు నేతలు పోటీ పడ్డారు. మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, కోడెల శివరాం తదితరులు ప్రయత్నం చేశారు. సత్తెనపల్లిలో కొత్త వస్తాదులు వస్తున్నారని నిన్ననే మంత్రి అంబటి కామెంట్స్ చేయడం, ఆ మరుససటి రోజే కన్నాకు బాధ్యతలు చేపట్టడంతో సర్వత్రా ఆసక్తి రోపుతోంది.
జిల్లాలో 17 నియోజకవర్గాలుంటే 16 చోట్ల టీడీపీకి ఇంచార్జిలు ఉన్నారు. ఒక్క సత్తెనపల్లికి మాత్రమే ఇప్పటివరకూ ఎవరినే నియమించలేదు. ఇప్పుడు తాజాగా కన్నా లక్ష్మీనారాయణ నియామకంతో మొత్తం 17 నియోజకవర్గాలకు ఇంచార్జుల నియామకం పూర్తయింది. గతంలో కోడెల శివప్రసాద్ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. కోడెల మరణం తర్వాత సత్తెనపల్లిలో కొంత గ్యాప్ ఏర్పడింది. ఇప్పుడు కన్నా నియామకంతో కోడెల లేని లోటును భర్తీ చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది.
Also Read.
విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. స్కూల్ ప్రారంభం రోజే గిఫ్ట్స్