- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
22 ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇస్తున్న నాగార్జున బ్యూటీ.. ‘మజాకా’ నుంచి పోస్టర్ విడుదల

దిశ, సినిమా: హీరోయిన్ అన్షు అంబానీ(Anshu Ambani) 2002లో అక్కినేని నాగార్జున సరసన ‘మన్మధుడు’(Manmadhudu) సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత ప్రభాస్(Prabhas) రాఘవేంద్ర, మిస్సమ్మ(Missamma) వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇటీవల అన్షు పలు టీవీ షోలలో కనిపించడంతో పాటు ఇంటర్వ్యూలు(Interviews) కూడా ఇచ్చింది. అలాగే సోషల్ మీడియాలోనూ పలు ఫొటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.
ఇక పిల్లలు పుట్టారు కాబట్టి రీ ఎంట్రీ ఇచ్చే ప్రసక్తి లేదని అంతా భావించారు. ఒకవేళ ఇచ్చినా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తుందని ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలో.. తాజాగా, అన్షు సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. 22ఏళ్ల తర్వాత ఆమె హీరోయిన్‌గానే ఎంట్రీ ఇస్తూ అందరికీ షాకిచ్చింది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) ‘మజాకా’ (Mazaka)చిత్రంలో నటిస్తోంది.
ఈ మేరకు మేకర్స్ అన్షు ఫస్ట్ లుక్ పోస్టర్(First look poster)ను షేర్ చేశారు. ఇందులో ఆమె పెళ్లి కూతురు గెటప్‌లో చేతిలో తాళి, కొబ్బరిబోండం పట్టుకుని దండ వేసుకుని నవ్వుతూ స్టిల్ ఇచ్చింది. మజాకాలో అన్షు యశోద పాత్రలో నటిస్తుంది. అయితే ఈ సినిమాకు త్రినాథ రావు నక్కిన(Trinatha Rao Nakkina) దర్శకత్వం వహిస్తుండగా.. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్(AK Entertainments) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అన్షు లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.