- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుది దశకు టీడీపీ అభ్యర్థుల ఖరారు.. ప్రకటన అప్పుడే!
దిశ, ప్రతినిధి కడప: ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ అభ్యర్థుల ఖరారు తుది అంకానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటులో అవలంభించాల్సిన వ్యూహం, అసెంబ్లీ అభ్యర్థుల అంశంపై బుధవారం విజయవాడలో పార్టీ వ్యవహారాలు, వ్యూహ కర్తల సమావేశం జరిగినట్లు సమాచారం. ఇప్పటికే పులివెందుల అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని, జమ్మలమడుగు అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మిగిలిన కడప, మైదుకూరు, బద్వేలు, రైల్వే కోడూరు అసెంబ్లీ అభ్యర్థులను కొద్ది రోజుల్లోనే ప్రకటించేందుకు సంసిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ నాయకుల ద్వారా తెలుస్తోంది.
- బద్వేలు అసెంబ్లీ నుంచి గతంలో పోటీ చేసిన డాక్టర్ రాజశేఖర్‌తో పాటు కొత్తగా తెరపైకి వచ్చిన డిప్యూటీ ఇంజనీర్ రోశన్న పేర్లు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ నేతలు విజయమ్మ, రితీష్ రెడ్డి అధిష్టానానికి వీరిలో ఒకరి పేరు సూచించినట్లు తెలుస్తోంది.
- రైల్వే కోడూరు నుంచి గతంలో పోటీ చేసిన నరసింహ ప్రసాద్ తో పాటు మరో మహిళ అనితా దీప్తి టికెట్ రేసులో ఉన్నారు. వీరే కాకుండా తాజాగా లండన్ లో ఉంటున్న మరో మహిళ అనూహ్యంగా కోడూరు టీడీపీ టికెట్ ఆశిస్తున్న వారి జాబితాలో చేరిపోయింది. ఆమె తండ్రి రెవెన్యూ అధికారిగా ఆ నియోజకవర్గంలో పని చేయడంతో పాటు బాగా పరిచయాలు ఉన్నాయి. ఈ ముగ్గురిలో ఒక పేరు ఖరారు చేసేందుకు కూడా పార్టీ ఓ నిర్ణయానికి వచ్చేందుకు తది కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
- మైదుకూరు అసెంబ్లీ నుంచి గతంలో పోటీ చేసిన నియోజకవర్గ ఇన్‌చార్జి సుధాకర్ యాదవ్ నే ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అధిష్టానానికి కీలకంగా మారిన కడప అసెంబ్లీ టికెట్టు కోసం తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి సతీమణి మాధవి, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మి రెడ్డి కోడలు ఉమాదేవి ప్రధానంగా రేసులో ఉన్నారు. వీరితో పాటు ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌చార్జి అమీర్ బాబు టికెట్ ఆశిస్తున్నారు.
దసరా లోపు లేదా ఆ తర్వాత అన్ని స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని అన్ని నియోక వర్గాలపై కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు టీడీపీ వర్గాల ద్వారా అందిన సమాచారం.
Read More: Nara Lokesh : చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేస్తాం : నేతన్నలకు లోకేశ్ హామీ