Breaking: వైఎస్ భాస్కర్ రెడ్డికి మళ్లీ అస్వస్థత.. నిమ్స్‌లో వైద్య పరీక్షలు

by srinivas |
Breaking: వైఎస్ భాస్కర్ రెడ్డికి మళ్లీ అస్వస్థత.. నిమ్స్‌లో వైద్య పరీక్షలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్‌లో ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం వైఎస్ భాస్కర్ రెడ్డి బీపీ పెరిగి అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు జైలు అధికారులకు సూచించారు.

దీంతో శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి వైఎస్ భాస్కర్ రెడ్డిని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్‌లో వైఎస్ భాస్కర్ రెడ్డి అనారోగ్యానికి సంబంధించి గుండె సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎమర్జెన్సీ వార్డులో ప్రత్యేక వైద్యుల బృందం ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం వైఎస్ భాస్కర్ రెడ్డిని జైలు అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Advertisement

Next Story