చంద్రబాబు ఇంటివద్ద కేఏ పాల్ హల్‌చల్

by GSrikanth |   ( Updated:2024-03-11 14:50:00.0  )
చంద్రబాబు ఇంటివద్ద కేఏ పాల్ హల్‌చల్
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఇంటివద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్‌చల్ చేశారు. సోమవారం ఉండవల్లిలోని సీబీఎన్ నివాసం వద్ద కారు ఆపి స్లోగన్స్ ఇచ్చారు. ‘పాల్ రావాలి.. పాలన మారాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే, చంద్రబాబు ఇంట్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలపై చర్చలు జరుగుతున్నాయన్న సమాచారం తెలుసుకున్న కేఏ పాల్ అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నుంచి ప్రజలు కొత్తగా ఏం ఆశించడం లేదని అన్నారు.

ఆయన పాలనను ఇప్పటికే అనేకసార్లు చూశారని తెలిపారు. ఇక పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చే అవకాశం లేకుండా చంద్రబాబు చేశారని.. ఒకవేళ అదృష్టవశాత్తు పవన్ కల్యాణ్‌కు అధికారం దక్కినా ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు. పాలించడం అంటే సినిమాల్లో డ్యాన్సులు చేసినంత ఈజీ కాదని సెటైర్లు వేశారు. ఇక పదేళ్లుగా ఏపీ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీని ఎవరూ నమ్మబోరని స్పష్టం చేశారు. స్పెషల్ ప్యాకేజీ, ప్రత్యేక హోదా, పోలవరాన్ని నిర్లక్ష్యం చేసిన మోడీకి ఈ సారి తగిన బుద్ధి చెబుతారని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read More..

రూ.4400 కోట్ల కుంభకోణం.. ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు

Advertisement

Next Story