అమిత్ షా సభలో జూనియర్ NTR ప్లెక్సీలు

by GSrikanth |
అమిత్ షా సభలో జూనియర్ NTR ప్లెక్సీలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా ఏపీలో పర్యటిస్తున్నారు. ఆదివారం ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున భారీ బహిరంగ నిర్వహించారు. అయితే సభాస్థలిలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు భారీగా ఎన్టీఆర్ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్లెక్సీలు అన్నీ పైకి చూపిస్తూ ‘జూనియర్ ఎన్టీఆర్ సీఎం సీఎం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సభ ముగిసిన అనంతరం అమిత్ షా తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కాగజ్‌నగర్‌లో జరగనున్న బీజేపీ వికాస సంకల్ప సభలో అమిత్‌షా పాల్గొని ప్రసంగిస్తారు. కాగా ఈ బహిరంగ సభకు జిల్లాలోని పార్టీ నాయకులు, ప్రజలు, అభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీజేపీ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి అలిజాపూర్‌ శ్రీనివాస్‌ పిలుపు నిచ్చారు.

Next Story

Most Viewed