- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking; నార్త్ కొరియా కిమ్ పోలికలతో జిమ్.. క్యారెక్టర్ సేమ్ టు సేమ్
దిశ వెబ్ డెస్క్: ఈ ప్రపంచంలోనే అత్యంత క్రూరుడిగా పేరుగాంచిన నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తో వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పోలుస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడిన మాటలకు వీడియో రూపొందించి టీడీపీ తన ట్విట్టర్ వేదికలో పోస్ట్ చేసింది. ఆ వీడియోకి..ఈ రోజుల్లో కూడా నియంత అనిపించుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చేస్తున్న దారుణాల గురించి ప్రపంచం భయం భయంగా చెప్పుకుంటుంది.
కానీ అలాంటి నియంతను పోలిన జిమ్ అనే నియంత ఒకరు మన ఆంధ్రాలోనే ఉన్నాడు. ఎవరా జిమ్? చూడండి.. అనే ట్యాగ్ లైన్ జోడించింది. నార్త్ కొరియాలో ఒక నియంత ఉన్నాడని.. అతని పేరు కిమ్.. అలానే ఆంధ్రాలో కూడా ఒక నియంత ఉన్నారు.. అతని పేరు జిమ్ అని పేర్కొన్నారు. ఇక ఒక హెయిర్ స్టయిల్ తప్ప ఇద్దరు సేమ్ టు సేమ్ అని అన్నారు.
నార్త్ కొరియాలో కిమ్ కి 17 ప్యాలెస్ లు ఉంటె.. ఆంధ్రలో జిమ్ కి 6 ప్యాలెస్ లు ఉన్నాయని తెలిపారు. ఇక నార్త్ కొరియాలోని కిమ్ తన సొంత బాబాయిని, సొంత అన్నని చంపేశారని.. అలానే ఆంధ్రలోని జిమ్ సొంత బాబాయిని చంపేశారని.. తల్లిని చెల్లిని ఇంట్లో నుండి బయకు గెంట్టేశారని ఆరోపించారు. నార్త్ కొరియా కిమ్ 340 మందిని చంపేశాడని.. వేలాదిమందిని జైలుకు పంపించారని తెలిపారు.
అలానే ఆంధ్రాలో ఉన్న జిమ్ బీసీ,ఎస్సీ,ఎస్టీ సోదరులను ఇబ్బంది పెట్టి.. అనేకమందిని చంపేశారని మండిపడ్డారు. దళిత డాక్టర్ సుధాకర్ ని ప్రభుతం ఎలా చంపింది మనందరం చూశామని లోకేష్ పేర్కొన్నారు. అలానే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమని అడిగిన అంగన్వాడీలను ఎలా కొట్టి జైలుకు పంపంచారో చూశామని లోకేష్ ఆ వీడియోలో అన్నారు.
ఈ రోజుల్లో కూడా నియంత అనిపించుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చేస్తున్న దారుణాల గురించి ప్రపంచం భయం భయంగా చెప్పుకుంటుంది. కానీ అలాంటి నియంతను పోలిన జిమ్ అనే నియంత ఒకరు మన ఆంధ్రాలోనే ఉన్నాడు. ఎవరా జిమ్? చూడండి.#RichestCMJagan #EndOfYCP#YCPAntham #2024JaganNoMore… pic.twitter.com/eVGxuDvH21
— Telugu Desam Party (@JaiTDP) March 14, 2024