- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jana Sena Chief Pawan Kalyan : తిరుపతికి పవన్ కల్యాణ్..తరలివచ్చిన జనసైనికులు
దిశ, డైనమిక్ బ్యూరో : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన నేత కొట్టేసాయిపై టౌన్ సీఐ అంజూయాదవ్ చెంపదెబ్బలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తపై చేయి చేసుకుంటే తనపై చేయిచేసుకున్నట్లేనని పవన్ కల్యాణ్ భావించారు. ఈ సంగతి తిరుపతి జిల్లాలోనే తేల్చుకుంటానని తెగేసి చెప్పారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ సోమవారం తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కల్యాణ్‌కు పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పార్టీ నేతలు చిలకం మధుసూదన్ రెడ్డి, కిరణ్ రాయల్‌తోపాటు ఇతర నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు, జనసైనికులతో కలసి భారీ ర్యాలీగా పవన్ కల్యాణ్ తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి బయలుదేరారు. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సైతం పవన్ కల్యాణ్ వెంట ఉన్నారు. ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని తిరుపతి ఎస్పీకి సీఐ అంజూయాదవ్‌పై ఫిర్యాదు చేయనున్నారు. విచక్షణారహితంగా తమ కార్యకర్తపై దాడి చేసినందుకు అంజూయాదవ్‌పై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ కోరనున్నారు.
ఇవి కూడా చదవండి:
చర్యలు తీసుకోండి: సీఐ అంజుయాదవ్‌పై Pawan Kalyan ఫిర్యాదు
పవన్ ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
నకిలీ నాయకులు గొంతు చించుకుంటున్నారు నమ్మొద్దు: Poonam Kaur సంచలన ట్వీట్