Pawan Kalyan : వలంటీర్స్ వండర్స్ - ఎపిసోడ్ ఇన్ఫినిటీ :వలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేసిన Janasena

by Seetharam |   ( Updated:2023-07-31 15:47:12.0  )
Pawan Kalyan : వలంటీర్స్ వండర్స్ - ఎపిసోడ్ ఇన్ఫినిటీ :వలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేసిన Janasena
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖ జిల్లా పెందుర్తి సుజాతనగర్‌లో వరలక్ష్మి అనే వృద్ధురాలిని అక్కడ వలంటీర్‌ వెంకటేశ్ అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. జనసేన నాయకుడు చేసిన ఒక పోస్ట్‌ని పవన్ కల్యాణ్ రీ ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్స్ వండర్స్ - ఎపిసోడ్ ఇన్ఫినిటీ అంటూ, వలంటీర్స్ చేసేవి అనంతమంటూ సెటైర్లు వేశారు. పెందుర్తి లో 72 ఏళ్ల వృద్ధురాలిని బంగారం కొట్టేయడం కోసం హత్య చేసిన ‘వాలంటీర్ వెంకటేశ్’ అంటూ వలంటీర్లను జనసేన మరోసారి టార్గెట్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల స్ఫూర్తితో హత్య చేశాడా మీ సేవ రత్న.. వైఎస్ జగన్ సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. అంతేకాదు వలంటీర్ల వ్యవస్థపై ఇటీవలే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల వీడియోను సైతం పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి మహిళల ఫోటోలను వలంటీర్లు తీస్తున్నారు..వలంటీర్ వ్యవస్థ క్యాన్సర్ గడ్డలాంటిది: MP Raghu Rama Raju

Advertisement

Next Story