కృష్ణంరాజు ఎంతో బాధ్యతాయుతమైన వ్యక్తి: పవన్ కల్యాణ్

by GSrikanth |   ( Updated:2022-09-11 12:39:50.0  )
కృష్ణంరాజు ఎంతో బాధ్యతాయుతమైన వ్యక్తి: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ కృష్ణంరాజు అకాల మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్త వినగానే.. టాలీవుడ్ ప్రముఖలంతా తమ సంతాపాన్ని తెలియజేశారు. తాజాగా.. ఆయన మరణవార్త తెలియగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ''తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు శ్రీ కృష్ణంరాజు గారు. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయరే వారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన కృష్ణంరాజు గారు తుదిశ్వాస విడిచారనే వార్త తనను దిగ్భ్రాంతికి కలిగించింది. ఇటీవలి కాలంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారని వార్త చూసి, మళ్లీ త్వరగా కోలుకుంటారని ఆశించాను. ప్రజా జీవితంలో ఎంతో బాధ్యతాయుతంగా వారు అందించిన సేవలు మరువలేనివి, కృష్ణంరాజు గారి కుటుంబసభ్యులకు తన తరపున, జనసైనికుల తరుపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.'' సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు.

Also Read : కృష్ణంరాజు మృతిపై అనుష్క ఎమోషనల్ ట్వీట్..

Advertisement
Next Story