Jaleel Khan : మరోసారి నోరు జారిన జలీల్ ఖాన్..

by Ramesh Goud |
Jaleel Khan : మరోసారి నోరు జారిన జలీల్ ఖాన్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: అప్పట్లో బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని చెప్పి వైరల్ గా మారిన జలీల్ ఖాన్, ఇప్పుడు రాబోయే ఎన్నికలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లోకెక్కాడు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఏపీలోని అన్ని పార్టీల్లో సీట్ల పంచాయితీ జరుగుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయవాడ వెస్ట్ టికెట్ నాదేనని, నేనే నిలబడతానని, గెలుపు కూడా తనదేనని ధీమా వ్యక్తం చేశారు.

టికెట్ అందరూ అడుగుతారని, కానీ గెలిచే స్తోమత ఉండాలని, మంచి విలువలతో కూడిన క్యారెక్టర్ కూడా ఉండాలని అలాంటి వాళ్లకే సీటు దక్కతుందని అన్నారు. అలాగే అధిష్టానం సర్వే చేసి గెలుపు గుర్రాలకే టికెట్ కేటాయిస్తుందని, సర్వే ప్రకారం విజయవాడ వెస్ట్ టికెట్ టీడీపీకే వస్తుందని తెలిపారు. అంతేగాక సీటు తనకి కేటాయించకపోతే ఊరి వేసుకుంటానని నోరు జారి.. మళ్లీ సరిదిద్దుకొని, మా ముస్లిం మైనారిటీ సోదరులు తనకు టికెట్ కేటాయించకపోతే ఉరి వేసుకోవడానికి సిద్దంగా ఉన్నారని, ఇప్పటికే ఇద్దరు, ముగ్గురిని ఆపానని అన్నారు. కాగా, మరోవైపు టికెట్ తనకే కేటాయించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed