జగన్ పాపం పండింది.. వైసీపీకి మూడింది : నారా లోకేశ్

by Seetharam |   ( Updated:2023-09-19 06:32:14.0  )
జగన్ పాపం పండింది.. వైసీపీకి మూడింది : నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై పార్టీ, ప్రజలు చేపట్టిన కార్యక్రమాలను చూసి వైసీపీ ప్రభుత్వం వణికిపోతోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వ కుట్రలు విఫలం కావాలని.. చంద్రబాబుకు మంచి జరగాలని దేవాలయాల్లో పూజలకు వెళుతున్నవారిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అడ్డుకోవడంపై లోకేశ్ మండిపడ్డారు. ఢిల్లీలో మంగళవారం మీడియాతో లోకేశ్ మాట్లాడారు. గుడికి వెళుతుంటే కూడా అర్థం లేని నిబంధనలతో అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం జగన్ పిరికితనానికి నిదర్శనం అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాపం పండిందని, వైసీపీ ప్రభుత్వానికి మూడిందని లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నేతలు, ప్రజలు గుడికి వెళ్లాలో వద్దో కూడా జగన్ నిర్థేశిస్తారా?ముందస్తు అరెస్టులు, గృహ నిర్భంధాలతో నిరసనలను, చంద్రబాబుకు వస్తున్న మద్ధతును అడ్డుకోలేరని లోకేశ్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు అరెస్టుపై దేశ, విదేశాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి అని చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న దీక్షలు, నిరసనలు, ర్యాలీలు చంద్రబాబు నిష్కళంక చరిత్రను చాటి చెబుతున్నాయని లోకేశ్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు రాజకీయ జీవితానికి, ఆయన చేసిన అభివృద్ధికి నిదర్శనం అని నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఒక మాజీ సీఎం అరెస్టుపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు జరగడం ఇదే ప్రథమం అని అన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా వివిధ వర్గాల ప్రజలు బయటకు వచ్చి మద్ధతు ప్రకటించడం సంతోషకరమన్నారు. చంద్రబాబుకు, టీడీపీకి మద్దతుగా నిలుస్తూ నిరసన తెలుపుతున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెప్తున్నట్లు లోకేశ్ వెల్లడించారు. చంద్రబాబు పాలసీల కారణంగా లబ్ది పొందిన వర్గాలు నేడు పెద్ద ఎత్తున మద్ధతు పలుకుతున్నాయని...ఇదీ చంద్రబాబు క్రెడిబిలిటీ అంటే అని నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.

Read More..

స్కిల్ స్కామ్ కేసు : రంగంలోకి సుప్రీంకోర్టు న్యాయవాదులు

బ్రేకింగ్.. చంద్రబాబు అరెస్ట్‌పై ఢిల్లీలో దీక్షకు దిగిన నారా లోకేష్

Advertisement

Next Story

Most Viewed