జగన్‌కు తెలిసింది అరాచకం..దోపిడీ.. విధ్వంసమే : ధూళిపాళ్ల నరేంద్ర

by Seetharam |
జగన్‌కు తెలిసింది అరాచకం..దోపిడీ.. విధ్వంసమే : ధూళిపాళ్ల నరేంద్ర
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఇన్నర్ రింగ్ రోడ్ కేసు దర్యాప్తు అధికారి మార్పు వెనక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తప్పుడు మార్గాల్లో చంద్రబాబునో, మరొకరినో ఇరికించాలన్న దురుద్దేశంతోనే జగన్ సర్కార్ దర్యాప్తు అధికారిని మార్చినట్టు స్పష్టమవుతోందన్నారు. చంద్రబాబు అరెస్ట్ తనకు తెలియదని జగన్ చెప్పడం..ఆయనలోని నటనా కౌశలానికి మచ్చుతునక అని అభిప్రాయపడ్డారు. జగన్ కు తెలిసింది అరాచకం..దోపిడీ.. విధ్వంసమేనని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం చంద్రబాబు నాయుడు విలేకరులతో మాట్లాడారు.‘శాంతి భద్రతల వ్యవహారాలు.. వాటిని పర్యవేక్షించే విభాగాలు.. విచారణాసంస్థలు అన్నీ ముఖ్యమంత్రి అధీనంలోనే ఉంటాయని అందరికీ తెలుసునన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపే సంస్థలు, అధికారులు అందరూ ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని ప్రజలకు బాగా తెలుసునని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి .. ప్రభుత్వం మోపే అన్ని అభియోగాలు.. అభాండాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పటి కప్పుడు ఆధారాలతో సహా సమాధానం చెబుతూనే ఉందని చెప్పుకొచ్చారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించిన వాస్తవాలను అన్ని రూపాల్లో ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. అవేవీ ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి కనిపించవు. కేవలం చంద్రబాబు జైల్లో ఉండాలి..తాము ఆనందించాలన్నదే వారి లక్ష్యం అని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ పై... ఆయన జైల్లో ఉండటంపై మంత్రులు అంబటి రాంబాబు, అమర్నాథ్.. మరికొందరి వ్యాఖ్యలు వారి అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనం అని మండిపడ్డారు. నోరుందని ఇష్టమొచ్చినట్టు మాట్లాడే మంత్రులకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారు అని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ హెచ్చరించారు.

రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన జగన్

రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన జగన్ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజలు, రాష్ట్రం కోసం పనిచేయాల్సిన వ్యక్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసిన కేసుపై 20 నెలలుగా సీఐడీ విచారణ జరుపుతోంది. ఇన్నినెలల్లో ఏమీ తేల్చకపోయినా..ఎలాంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబుని అరెస్ట్ చేశారు. ఈ పని ఎందుకు చేశారంటే జగన్ తన రాజకీయ కక్షతో.. పైశాచిక ఆనందం కోసం చేశాడని చిన్నపిల్లలు కూడా చెబుతారు అని ధూళిపాళ్ల వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ రాజకీయకుట్రలు... వాటిలో పావులుగా మారిన అధికారులపై పూర్తిస్థాయి విచారణ జరిపించి, తప్పుచేసిన వారికి కఠినంగా శిక్షిస్తుంది అని తెలిపారు.

ఐఆర్ఆర్ కేసు విచారణాధికారి బదిలీ వెనుక కుట్ర

ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణ చేస్తున్న అధికారిని ఉన్నపళంగా ఎందుకు మార్చారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాధానం చెప్పాలి అని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ఏఎస్పీ స్థాయి అధికారి జయరాజ్‌ను మార్చి డీఎస్పీ స్థాయి అధికారి విజయ్ భాస్కర్‌ను ఎందుకు విచారణాధికారిగా నియమించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని నిలదీశారు. అధికారి మార్పుని బట్టే.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణలో ప్రభుత్వపాత్ర ఉందని స్పష్టమవుతోంది అని వ్యాఖ్యానించారు. న్యాయస్థానాల్లో కేసుల విచారణ కీలక దశలో ఉందని చెప్పే ప్రభుత్వం.. అర్థం పర్థం లేకుండా విచారణాధికారుల్ని ఎందుకు మారుస్తోంది? అని నిలదీశారు. తాము చెప్పినట్టు వినడం లేదనే జయరాజ్ ను తప్పించారా? అధికారిని మార్చడం ద్వారా ప్రభుత్వం పెద్దకుట్రకు ప్రణాళికలు వేస్తోందని అర్థమవుతోంది అని అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తప్పు డు మార్గాల్లో ఏదోరకంగా చంద్రబాబునో, మరొకరినో ఇరికించాలన్న దురుద్దేశంతోనే ప్రభుత్వం అధికారిని మార్చినట్టు స్పష్టమవుతోంది అని చెప్పుకొచ్చారు. దర్యాప్తు అధికారిని మార్చి అతని ద్వారా తాము అనుకునేది చక్కబెట్టుకోవాలని ప్రభుత్వం అనుకుంటే, అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటుంది అని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కార్ రాజకీయ కుట్రలతో ఆడించే ఆటలపై.. వాటిలో పావులుగా మారి, ముఖ్యమంత్రికి దాసోహమైన అధికారులపై పూర్తిస్థాయిలో దృష్టి పెడుతుంది అని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ హెచ్చరించారు.

Advertisement

Next Story