డ్రైవింగ్ తెలియక రివర్స్ పాలన చేస్తున్న డ్రైవర్ జగన్..చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web Desk 18 |
డ్రైవింగ్ తెలియక రివర్స్ పాలన చేస్తున్న డ్రైవర్ జగన్..చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ ప్రతినిధి,గుంటూరు: చీరాల అంటే చరిత్ర కలిగిన ప్రాంతం. 1919లో చీరాల – పేరాల ఉధ్యమంలో బ్రిటీష్ వాళ్లు మున్సిపాలిటీ చేసి పన్నులు బాదుడే బాదుడు చేశారు. ఇప్పుడు సైకో అదే విధంగా అదే పని చేస్తున్నారు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రచారంలో భాగంగా చీరాల ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగిస్తు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నేతృత్వంలో పోరాటం చేశారు. ఈ పన్నులు తట్టుకోలేక ఊరుకు ఊరే ఖాళీ చేసి రాంనగర్ అనే ఊరును నిర్మాణం చేసుకొని నిరసన తెలిపారు. ఎన్నికల ముందు అందరి దగ్గరకు వచ్చి ముద్దులు పెట్టాడు, నెత్తిన చేయి పెట్టాడు. బుగ్గలు నిమిరాడు, తీరా అధికారంలోకి వచ్చాక పిడి గుద్దులు గుద్దాడు అని ఎద్దేవా చేశారు.

ఈ దుర్మార్గులను తుదముట్టించి ప్రజాస్వామ్యం నిర్మాణం చేసే బాధ్యత కూటమిది. పరిపాలన తెలిసిన వాడు ఒక పద్ధతి ప్రకారం సంక్షేమానికి తోడు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేతకాని దద్దమ్మ. డ్రైవర్ కి డ్రైవింగ్ తెలియకపోతే రివర్స్ గేర్‌లో వెనక్కి వెళ్లినట్లు రాష్ట్రంలో రివర్స్ పాలన జరుగుతుంది. ఏ శాఖ అయినా పని చేస్తుందా? రూ.13 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఆదాయం లేదు. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే మేనిఫెస్టోపై చేతులు ఎత్తేశాడు. సంపద సృష్టిస్తే ఆదాయం వస్తుంది. నాడు నేను చేసిన అభివృద్ధిని అడ్డం పెట్టుకుని అప్పులు తెచ్చారు. ఇప్పుడు అప్పులు తెచ్చే పరిస్థితి లేదు.

ఆడబిడ్డలకు పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ..

ఏ పని చేసినా ప్రజలకు ఉపయోగపడాలి. మే 13 ఎప్పుడెప్పుడు వస్తుందా? కూటమి అభ్యర్ధులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలందరూ కసి మీద ఉన్నారు. స్వేచ్ఛగా ఆలోచించి భవిష్యత్ ఓటు వేయండి అని చంద్రబాబు తెలిపారు. అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్లకు రిజర్వేషన్లు లేవని బాధపడేవారు. మొదటి సారిగా అగ్రవర్ణ పిల్లలకు 10 శాతం ఉద్యోగాలు రిజర్వ్ చేశాం అన్నారు.టీడీపీ ఆడబిడ్డలకు పుట్టిల్లు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు, విద్యకు ప్రాధాన్యం ఇచ్చింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. డ్వాక్రా సంఘాలు పెట్టింది కూడా టీడీపీనే అన్నారు. దీపంతో వంట గ్యాస్ సిలెండర్లు ఇచ్చాం. మరుగుదొడ్లు కట్టించాం. పసుపు కుంకుమ కింద రూ.10వేల కోట్లు ఇచ్చాం. డ్వాక్రా సంఘాల రుణాలు కొంత వరకు మాఫీ చేశాం. అందుకే ఆడబిడ్డలను శక్తివంతమైన ఆడబిడ్డలుగా, గౌరవంగా బతికే విధంగా తయారు చేసే బాధ్యత మాది అని పేర్కొన్నారు.

Next Story

Most Viewed