- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీలో పెను సంచలనం...బీజేపీలోకి ఆరుగురు ఎంపీలు..!
దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సంచలన పరిణామం చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు రాజ్యసభ్యులు అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, ఆర్ కృష్ణయ్య, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ యాదవ్ వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం.అంతేకాదు బీజేపీలో చేరేందుకు దాదాపుర రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ మోపిదేవి వెంకట రమణ వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో ఎంపీ గొల్ల బాబూరావు సైతం వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చర్చ సాగుతోంది. మోపిదేవి, గొల్ల బాబురావు వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరికి ఎమ్మెల్సీలు ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం రెడీ అయినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు. మరికొంతమంది కీలక నేతలు వరుస పెట్టి వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు రావడం, అధికారం కోల్పోవడంతో నేతలు పార్టీలు మారబోతున్నట్లు సమాచారం. అయితే ఈ పరిణామాలు వైసీపీలో పెనుసంచలనమేనని పలువురు చెబుతున్నారు.