నాపేరు మీద మూడు ఓట్లు ఉండటం నిజమే కానీ...: మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్

by Seetharam |
Minister Anil Kumar Yadav
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల అక్రమాలకు పాల్పడుతుందని.. దొంగ ఓట్లు నమోదు చేయించిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందుకు ఆధారాలు సైతం చూపిస్తున్నాయి. మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు మూడు ఓట్లు ఉండటమే అందుకు నిదర్శనమంటున్నారు. అయితే ప్రతిపక్షాల ఆరోపణలపై మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ స్పందించారు. 2019 ఎన్నికలకు ముందే తనపేరు మీద మూడు ఓట్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తన పేరు మీద మూడు ఓట్లు ఉన్నాయంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని... కానీ తాను ఈ విషయాన్ని 2019 ఎన్నికలకు ముందే ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. 2019 ఎన్నికల సమయలో తన పేరు మీద మూడు ఓట్లు ఉన్నట్లు గుర్తించి తన ఇంటి పేరు మీద ఉన్నది కాకుండా మిగతా రెండు ఓట్లు తొలగించాలని విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. ఈ మేరకు ఈసీకి తాను డిక్లరేషన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ చేసిన ఆరోపణలను మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఖండించారు. దొంగ ఓట్లు వేయాల్సిన అవసరం తనకు లేదు అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. చేతకాక విపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. టీడీపీ నేతలు, కమ్యూనిస్టు నేతలు తనపై కావాలనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు.

Advertisement

Next Story