- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వివేకాను కూతురు, అల్లుడే చంపారని సజ్జల అనడం దుర్మార్గం : Somireddy Chandramohan Reddy
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీబీఐ దర్యాప్తు సంస్థపై బరితెగించి మాట్లాడుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వివేకానంద రెడ్డి హత్యకేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ తప్పుడు దర్యాప్తు చేసిందంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ సీఐడి మాదిరే సీబీఐ కూడా పనిచేయాలని కోరుకుంటున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తప్పుచేయకపోయినా కేసులు పెట్టాలి.. ఎంపీ రఘురామ కృష్ణంరాజుని ఇబ్బందిపెట్టినట్టు అందరినీ ఇబ్బంది పెట్టాలి.. దళితుల్ని చంపిన అనంతబాబు లాంటి వారిని ఊరేగించా లా.. జగన్ అభిమానినని చెప్పిన కోడికత్తి శ్రీనివాస్ ను నాలుగున్నర సంవత్సరాలు జైల్లో పెట్టినట్టుగా సీఐడీ పనిచేయాలన్నట్టు సజ్జల వైఖరి ఉంది’ అని అన్నారు. ఒక ఎంపీని అరెస్ట్ చేసి దుర్మార్గంగా కొట్టి, ముఖ్యమంత్రికి వీడియో కాల్ లో చూపించి న సీఐడీలాగా సీబీఐ పనిచేయాలా? అని నిలదీశారు. వివేకా నందరెడ్డిని ఆయన కూతురు, అల్లుడే చంపారని సజ్జల అనడం ఎంత దుర్మార్గం అని అన్నారు. ఇంత కంటే ఘోరం పాపం ఉంటుందా? సీబీఐ తప్పుడు దర్యాప్తుచేస్తే కేసువిచారణలో మీకు అనుకూలంగానే జరుగుతుంది కదా! ఎందుకు మరి ఇంతలా భయపడుతున్నా రు? అని నిలదీశారు. సీబీఐ దర్యాప్తుపై కథనాలు రాస్తున్నాయని, ఆ మీడియా.. ఈ మీడియాని నింది స్తున్న సజ్జలకు వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు సాక్షిలో ఏం ప్రచారంచేశారో తెలియదా? ఆ రోజున గుండెజబ్బు అని, నారాసుర వధ అని, చంద్రబాబే చంపించడా ని దుష్ప్రచారం చేశారు. సాక్షి పత్రికలో చంద్రబాబుకత్తి పట్టుకున్న ఫొటో వేసి రక్తపు మరకలు అంటించారు. ఏ మీడియా తప్పుదోవ పట్టించిందో తెలియదా? సీబీఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేశాక, దానిలోని వివరాలు ప్రజలకు తెలియచేయడం తప్పా...ఏమీలేని దాన్ని, ఎలాంటి ఆధారాలు లేనిదాన్ని ఇతరులకు ఆపాదించి దుష్ప్రచారం చేయడం తప్పా? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు.