- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
లోకేశ్‌కు ఎన్‌బీడబ్ల్యూ జారీ చేయండి: కోర్టులో సీఐడీ పిటిషన్
by Seetharam |

X
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఏపీ సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేశ్‌కు NBW జారీ చేయాలని పిటిషన్‌లో కోరింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ పై ఇప్పటికే సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుపై ఇప్పటికే హైకోర్టులో నారా లోకేశ్ పిటిషన్ వేశారు. అయితే లోకేశ్‌కు 41 ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశించింది. నారా లోకేశ్‌కు ఇప్పటికే 41A నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో...తాజాగా NBW జారీ చేయాలని విజయవాడలోని ఏసీబీ కోర్టును సీఐడీ ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నాం 2 గంటల తర్వాత విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story