- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భక్తుల మృతికి సీఎం బాధ్యుడు కాదా.. పవన్?: మాజీ మంత్రి

దిశ,వెబ్‌డెస్క్: తిరుపతి(Tirupati) వైకుంఠం టోకెన్ల తొక్కిసలాట ఘటన పై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నేతలు(YCP Leaders) కూటమి ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటన పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పడం, అలాగే టీటీడీ బోర్డు(TTD Board) కూడా క్షమాపణ చెప్పాలని ఆదేశించిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటన పై అధికారుల పై సీరియస్ అయ్యారు.
ఇదిలా ఉంటే.. తొక్కిసలాట ఘటన పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) మరోసారి స్పందించారు. తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(deputy Cm Pawan Kalyan) తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ‘‘కలవని "కల్తీ లడ్డుకి" బాధ్యుడు.. అప్పటి ముఖ్యమంత్రా? ఆరుగురు భక్తుల మృతికి ఇప్పటి ముఖ్యమంత్రి బాధ్యుడు కాదా?’’ పవన్ కళ్యాణ్ అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అంబటి తాజాగా ఆరోపించిన విషయం తెలిసిందే.