డా.బి.ఆర్ అంబేద్కర్‌ విగ్రహానికి అవమానం.. విగ్రహాన్ని కూల్చి, లోదుస్తులు వేసిన వైనం

by Seetharam |
డా.బి.ఆర్ అంబేద్కర్‌ విగ్రహానికి అవమానం.. విగ్రహాన్ని కూల్చి, లోదుస్తులు వేసిన వైనం
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. విగ్రహాన్ని కూల్చివేయడంతోపాటు చెత్తలో పడేశారు. అక్కడితో వదిలేయకుండా విగ్రహంపై లోదుస్తులు వేసి మరీ దారుణంగా వ్యవహరించారు. ఈ ఘటన ఎక్కడో మారుమూల గ్రామంలో జరిగింది కాదు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి కూతవేటు దూరంలో ఈ ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళ్తే తాడేపల్లి అంజిరెడ్డి కాలనీ సమీపంలోని చెత్తకుప్పలో డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం కొద్దిరోజులుగా పడి ఉంది. గుర్తుతెలియని వ్యక్తులెవరో ఈ విగ్రహాన్ని ఇక్కడ పడేసినట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ విగ్రహం గురించి నాయకులు కానీ అధికారులు కానీ స్పందించడం లేదని వాపోతున్నారు. చెత్తకుప్పల మధ్య అంబేద్కర్ విగ్రహం పడి ఉండటమే దారుణమంటే మరో అవమానకరమైన ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహంపై లోదుస్తులు వేసి దారుణంగా అవమానించారు. ఇది గమనించిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని అంజిరెడ్డి కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ప్రభుత్వం , అధికారులు స్పందించి అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడినుండి తరలించాలని కోరుతున్నారు. రాజ్యాంగ నిర్మాతను అవమానించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నేతలు కోరుతున్నారు.

Advertisement

Next Story