ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు: గడువు కోరిన సీఐడీ..చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

by Seetharam |   ( Updated:2023-11-21 11:17:58.0  )
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు: గడువు కోరిన సీఐడీ..చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌) అక్రమాల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు పిటిషన్‌ దాఖలు చేశారు. మంగళవారం విచారణ ప్రారంభం కాగానే సీఐడీ వాదనలు వినిపించేందుకు మరింత సమయం కోరింది. దీంతో న్యాయమూర్తి కేసు విచారణను ఈనెల 23కి హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత జడ్జిలను దూషించారంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.ఇకపోతే స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై విడుదలైన నేపథ్యంలో ఈ కేసులో గత విచారణ సందర్భంగా ఈ నెల 28 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయబోమని ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో కేసు తదుపరి విచారణను జస్టిస్ మల్లికార్జునరావు ఈనెల 21కి వాయిదా వేశారు. అయితే మంగళవారం విచారణ ప్రారంభంలో సీఐడీ న్యాయవాదుల పాస ఓవర్ అడగడంతో మరోసారి విచారణ వాయిదా పడింది.

Read More..

చంద్రబాబుకు బెయిలొచ్చినా ఆగని ఆందోళన: మిగిలిన కేసుల్లో తీర్పులపై ఉత్కంఠ

మత్స్య రంగ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం : అచ్చెన్నాయుడు

Advertisement

Next Story

Most Viewed