టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్‌లో ఆ కులం వారే ఎక్కువ?

by Ramesh N |   ( Updated:2024-02-24 14:07:16.0  )
టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్‌లో ఆ కులం వారే ఎక్కువ?
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ-జనసేన పోత్తులో భాగంగా ఇవాళ 118 స్థానాలకు సీట్లతో ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది. టీడీపీ 94, జనసేన 24 స్థానాల్లో పోటి చేయనున్నట్లు పార్టీ చీఫ్‌లు ప్రకటించారు. జనసేనకు మరో 3 లోక్‌సభ స్థానాలను కూడా ప్రకటించారు. మొదటి లిస్ట్‌లో బీసీలకు మైనార్టీలకు తక్కువ సీట్లు కేటాయించారని చర్చనీయశంగా మారింది.

టీడీపీ అధినేత చంద్రబాబు తన సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత నిచ్చారని టాక్ నడుస్తోంది. టీడీపీ 94 స్థానాల్లో 21 సీట్లు కమ్మలకు కేటాయించారని తెలుస్తోంది. మైనారిటీలకు ఒకే ఒక్క సీటు మాత్రమే ఇచ్చారు. బీసీలకు 18, ఎస్సీలు 20, కాపులకు 7 సీట్లు కేటాయించారు. రాష్ట్ర జనాభాలో కమ్మ కులస్తులు 4.5శాతం ఉన్నారని, కానీ వారికి సీట్లు ఎక్కువగా ఇచ్చారని చర్చ జరుగుతోంది.

Read More..

Janasena Party : ఆ నియోజకవర్గ టికెట్ పై కన్నేసిన జనసేన ??

Next Story

Most Viewed