- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: ఆసరా పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన ప్రకటన చేసింది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో మే 1వ తేదీ నుండి 5 తేదీ వరకు పెన్షన్లు జమ చేస్తామని వెల్లడించింది. కాగా, ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో పెన్షన్ పంపిణీ నుండి వాలంటీర్లను పక్కన పెట్టిన ఈసీ.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈసీ ఆదేశాల నేపథ్యంలో పెన్షన్ పంపిణీ విధివిధానాల్లో అధికారులు మార్పులు చేపట్టారు.
నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే పెన్షన్లు జమ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. మే 1వ తేదీ నుండి 5 వరకు లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్లు వేస్తామని పేర్కొన్నారు. బ్యాంక్ ఖాతా లేని వారికి, దివ్యాంగులకు నేరుగా ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తామని తెలిపారు. సచివాలయ ఉద్యోగాల ద్వారా మే 5 వరకు పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తామని వెల్లడించారు.