- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గిరిజన సమస్యలపై మాట్లాడితే అక్రమ కేసులా?: టీడీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధారు నాయక్
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో గిరిజనులకు రక్షణ లేకుండా పోయింది అని టీడీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధారు నాయక్ అన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక పులివెందులస్వామ్యమా అన్నట్లు ఉంది? అని మండిపడ్డారు. సమస్యలపై గళం విప్పితే పోలీసులతో ఇళ్లకు నోటీసులు పంపుతామన్నట్లు ప్రభుత్వ పెద్దల వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. ఒక గిరిజనుడిగా గిరిజన సమస్యలపై మాట్లాడితే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రాజన్నదొర తనపై కేసుపెట్టి పోలీసులను పంపడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు కరువై కొండ, గుట్టల్లో కొట్టుమిట్టాడుతున్న గిరిజనుల సమస్యలపై మాట్లాడే హక్కు మాకు లేదా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు సంబంధించిన 16 సంక్షేమ పథకలను రద్దు చేస్తే మేం ప్రశ్నించకూడదా? అని నిలదీశారు. బాధ్యయుతమైన ఉపముఖ్యమంత్రి పదవిలో ఉన్న పీడిక రాజన్నదొర అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పోలీసులను పంపడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గిరిజనులపై రోజుకొక దాడి జరుగతోంది. గిరిజనుల మాన, ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వం గిరిజనులపై అక్రమంగా, అన్యాయంగా మోపుతున్న కేసులపై జాతీయ ఎస్టీ కమీషన్లో ఫిర్యాదు చేస్తాం అని హెచ్చరించారు. పోలీసులను పంపి అరెస్టులు చేస్తామంటే గిరిజన సమస్యల గురించి మాట్లాడటం మానేయాలా? రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులు ఈ రాష్ట్రంలో గిరిజనులకు వర్తించవా? సమాజంలో వేలాది సంవత్సరాల నుంచి సామాజికంగా, ఆర్ధికంగా వెనకబడిన గిరిపుత్రులు ఇంకా వెనకే ఉండాలా? అని రాష్ట్ర టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎం ధారు నాయక్ అని అన్నారు.