టీడీపీ అధికారంలోకి వస్తే.. ప్రతి ఏటా డీఎస్సీ వేస్తాం : నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-02-11 07:33:20.0  )
టీడీపీ అధికారంలోకి వస్తే.. ప్రతి ఏటా డీఎస్సీ వేస్తాం : నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రజలంతా టీడీపీ, జనసేన కూటమికి ఓటేసి అధికారంలోకి తీసుకొస్తే.. ప్రతి ఏటా డీఎస్సీ వేసి ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ‘శంఖారావం’ యాత్రను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లడుతూ.. ప్రజా వ్యతిరేక పాలనను సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దే దింపే సమయం ఆసన్నమైందని అన్నారు. టీడీపీ పాలనలో ఉత్తరాధ్రను అభివ‌‌ృద్ధికి నమూన చేస్తే.. సీఎం జగన్ గంజాయికి కేంద్రంగా చేశారని దుయ్యబట్టారు.

నాలుగున్నరేళ్ల పాలనలో ఏనాడు గుర్తుకు రాని డీఎస్సీ, ఎన్నికల ముందే గుర్తుకు‌రావడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర చైతన్యం గల నేలని, ఎందరో మహానుభావులకు పుట్టినిల్లని పేర్కొన్నారు. 2019 ఎన్నికల కంటే ముందు 23 వేల పోస్టులతో డీఎస్సీ ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని వైకాపా హామీ ఇచ్చి, ఇప్పుడు కేవలం 18 వేల పోస్టులకు మాత్రమే డీఎస్సీ నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాలు సర్వనాశనం అయ్యాయని మండిపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రంలో మరో పదేళ్లు వెనక్కు వెళ్లిందని నారా లోకేశ్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed