తిరుమలలో స్టీల్ కడియం కొని ఖంగుతిన్న భక్తుడు.. అసలేం జరిగిందంటే..!

by srinivas |
తిరుమలలో స్టీల్ కడియం కొని ఖంగుతిన్న భక్తుడు.. అసలేం జరిగిందంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: అన్యమత ప్రచారకులు తిరుమల(Tirumala)ను వదలడంలేదు. ఏదో రూపంతో తమ మతాన్ని ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పరమతాలను గౌరవించాలనే సూత్రాన్ని మర్చిపోయి బరితెగిస్తున్నారు. ఇప్పటి వరకూ వాహనాల, పుస్తకాలపై అన్యమత ప్రచారం చేసిన దుండగులు ఇప్పుడు స్టైల్ మార్చారు. తిరుమలలో భక్తులు కొనుగోలు చేసే వస్తువుల్లోనూ అన్యమత ప్రచారం(Ancient Propaganda) చేస్తున్నారు. ఈ తరహా ఘటన తిరుమలలో తాజాగా వెలుగు చూసింది.

హైదరాబాద్‌కు చెందిన శ్రీధర్ కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనం(Srivari Darshan)కు వెళ్లింది. అయిలే తమ పిల్లడి కోసం తండ్రి శ్రీధర్ స్టీల్ కడియం కొనుగోలు చేశారు. రూమ్‌కి వెళ్లిన తర్వాత కడియంపై అన్యమతం పేరు, గుర్తు కనిపించింది. దీంతో శ్రీధర్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే టీటీడీ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కడియం విక్రయించిన షాపు వద్దకు వెళ్లిన టీటీడీ అధికారులు(Ttd Officials) ఆరా తీశారు. అనంతరం షాప్‌ను సీజ్ చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారంపై నిషేధం ఉందని, ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ అధికారులు హెచ్చరించారు.

Next Story

Most Viewed