- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యాసిడ్ దాడి ఘటన.. హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని అన్నమయ్య జిల్లా(Annamaiah District)లో శుక్రవారం ఓ యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లె గ్రామానికి చెందిన యువతిపై జరిగిన ఈ దాడిని సీఎం చంద్రబాబు(CM Chandrababu) తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ యాసిడ్ దాడి ఘటనపై తాజాగా హోంమంత్రి అనిత(Home Minister anitha) స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. SPతో మాట్లాడి హోంమంత్రి అనిత వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆమె బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే బాధిత యువతికి, ఆమె ఫ్యామిలీకి ప్రభుత్వం(AP Government) అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.