- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
వైఎస్సార్ జిల్లాలో హీరోయిన్ మెహ్రీన్, నిధి అగర్వాల్ సందడి

దిశ,వెబ్‌డెస్క్: వైఎస్సార్ జిల్లా(YSR District)లో సినీ తారలు మెహ్రీన్(Mehreen), నిధి అగర్వాల్(Nidhi Agarwal)సందడి చేశారు. జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం(kamalapuram Constituency) వల్లూరు మండలం(Vellore Mandal) గూడూరు సమీపంలో ‘కడప వండర్‌లా’(Kadapa Wonderela)ను ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీతారలు మెహ్రీన్, నిధి అగర్వాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా వీరికి అక్కడే ఉన్న పలువురు ప్రముఖులు స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి హీరోయిన్ మెహ్రీన్, నిధి అగర్వాల్ కడప వండర్‌లాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినీ తారలతో పాటు స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, టీడీపీ(TDP) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్త నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఐస్‌క్రీం స్టాల్ వద్ద నిధి, మెహ్రీన్ సందడి చేశారు. డాన్స్(Dance) చేస్తూ సందర్శకుల్లో ఉత్సాహం నింపారు. ఈ తరుణంలో స్థానికులు వారితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.