దుర్గమ్మ సేవలో హీరో విక్టరీ వెంకటేశ్

by Seetharam |
దుర్గమ్మ సేవలో హీరో విక్టరీ వెంకటేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : అగ్రనటుడు,విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. విక్టరీ వెంటేశ్‌ హీరోగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్ర యూనిట్ బృందం విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకుంది. హీరో వెంకటేశ్, దర్శకుడితోపాటు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌లు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినిమా విజయవంతం అయ్యేలా చూడాలని అమ్మవారిని చిత్రయూనిట్ బృందం వేడుకుంది. ఇకపోతే హిట్, హిట్2 చిత్రాల దర్శకుడు శైలేష్‌ కొలను ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సైంధవ్‌ సినిమాలో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ నటుడు ఆర్య, రుహానీ శర్మ తదితరులు ప్రముఖ పాత్రల్లో కనిపిస్తున్నారు.

Advertisement

Next Story