- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Srisailam Project:శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉధృతి
దిశ ప్రతినిధి,శ్రీశైలం ప్రాజెక్టు:శ్రీశైలం జలాశయానికి ఎగువ జూరాల సుంకేసుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో జలాశయం ఆనకట్ట నుంచి 10 గేట్లు ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 18 అడుగుల మేర ఎత్తి దిగువ సాగరకు 4,31,370 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదే సమయానికి జలాశయం నీటిమట్టం 883.80 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 208.7210 టీఎంసీలుగా ఉంది. అలాగే కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో గడిచిన 24 గంటలలో 24,917 క్యూసెక్కుల నీటితో 15.44 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని, ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో 35,315 క్యూసెక్కుల నీటితో 18.69 ఉత్పత్తిని చేస్తూ దిగువ నాగార్జునసాగర్‌కు విద్యుత్ ఉత్పాదన ద్వారా 61,810, 10 గేట్ల ద్వారా 4,31,370 క్యూసెక్కులతో కలిపి 4,91,602 క్యూసెక్కుల నీటిని దిగువ సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇదే విధంగా వరద కొనసాగితే మరో అయిదు అడుగుల క్రస్ట్ గేట్లు పైకి లేపి నీటిని దిగువకు విడుదల చేస్తాము అని అధికారులు తెలియజేశారు.