BREAKING: ఏపీ నూతన డీజీపీగా హరీష్ గుప్తా.. తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని ఈసీ ఆర్డర్

by Disha Web Desk 19 |
BREAKING: ఏపీ నూతన డీజీపీగా హరీష్ గుప్తా.. తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని ఈసీ ఆర్డర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ గుప్తా నియామయం అయ్యారు. ఇటీవల వేటుకు గురైన రాజేంధ్రనాథ్ రెడ్డి స్థానంలో ఎలక్షన్ కమిషన్ తాజాగా హరీష్ గుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హోం శాఖ కార్యదర్శిగా ఉన్న గుప్తాను తక్షణమే బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. కాగా, అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ రాజేంధ్రనాథ్ రెడ్డిపై ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీంతో ప్రతిపక్షాల కంప్లైంట్‌లను పరిశీలించిన ఎలక్షన్ కమిషన్ రాజేంధ్రానాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఆయనను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కొత్త డీజీపీ నియమాకానికి ముగ్గురు సీనియర్ అధికారుల జాబితాను పంపాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈసీ ఆర్డర్ మేరకు ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. సీనియర్ అధికారులు ద్వారకా తిరుమలరావు, హరీష్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్‌ల పేర్లను ప్రభుత్వం పంపగా.. ఇందులో ఏపీ నూతన డీజీపీగా ఈసీ హరీష్ రావు గుప్తాను ఎంపిక చేసింది. ఎన్నికల నేపథ్యంలో తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది.

Read More..

Breaking: వైఎస్ వారసత్వం తీసుకుంటే సరిపోదు.. ప్రాజెక్టులు పూర్తి చేయాలి కదా: జగన్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed