మహిళల కోసం ఆ నిర్ణయాన్ని ప్రకటిచడం సంతోషకరం.. సీఎం చంద్రబాబు ట్వీట్

by Ramesh Goud |   ( Updated:2025-03-08 16:17:20.0  )
మహిళల కోసం ఆ నిర్ణయాన్ని ప్రకటిచడం సంతోషకరం.. సీఎం చంద్రబాబు ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటిచడం సంతోషంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM చంద్రబాబు Naidu) అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) సందర్భంగా ప్రకాశం జిల్లా (Prakasham District) మార్కాపురంలో (Markapuram) ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న ఆయన.. మహిళలకు పలు కీలక హామీలు ఇచ్చారు. ఈ సందర్భంగా వేడుకలకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ (Twitter) ద్వారా షేర్ చేస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు, గోఏపీ (GoAP) ద్వారా మహిళలకు ఆంట్రప్రెన్యూర్‌షిప్ (Enterprenuership), డిజిటల్ వాణిజ్యం, శక్తి టీమ్స్ (Shakthi Teams), శక్తి యాప్‌తో (Shakthi Aap) భద్రత కల్పించడం, జీవనోపాధి కోసం ఫ్లిప్ కార్ట్ (Flipkart), ర్యాపిడో (Rapido) సహా ఇతర సంస్థలతో భాగస్వామ్యం చేయడం జరిగిందన్నారు. అంతేగాక అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ ప్రయోజనాలు, ఆర్థిక సహాయాన్ని అమలు చేయడం లాంటి పరివర్తనాత్మక కార్యక్రమాలను ప్రారంభించామని తెలిపారు. తాము మహిళల డిజిటల్ వ్యవస్థాపకతలో చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నామని, ఇక్కడ స్వయం సహాయక సంఘాల మహిళల నుండి 1 లక్ష+ ఉత్పత్తులు ఓఎన్డీసీ (ONDC) ద్వారా వావ్ జెని యాప్‌లో ప్రీ-బుక్ చేయబడ్డాయని వివరించారు. అలాగే ఇది రూ.1.6 కోట్ల లావాదేవీ విలువను సృష్టించి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించాయని తెలియజేశారు.

ఇక ప్రభుత్వంలోని మహిళా ఉద్యోగులను ఆదుకునేందుకు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించడం తనకు సంతోషాన్నిస్తోందని అన్నారు. గతంలో ప్రసూతి సెలవులు ఇద్దరు పిల్లలకు మాత్రమే పరిమితంగా ఉండేవని, ఇప్పుడు సంఖ్యతో సంబంధం లేకుండా పిల్లలందరికీ కవర్ చేయడానికి ప్రసూతి సెలవులను పొడిగిస్తున్నామని చెప్పారు. ఈ చర్య కుటుంబ వృద్ధిని ప్రోత్సహించడం, జనాభా సమతుల్యతను పరిష్కరించడం, వారి వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలను సమతుల్యం చేయడంలో మహిళలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. మహిళలకు సాధికారత కల్పించడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు బలమైన భవిష్యత్తును నిర్మించేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెబుతూ.. మహిళల కోసం కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Next Story