ఊపిరి పీల్చుకోగలిగాం.. ఉత్తర కాశీ టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్‌పై పవన్ కల్యాణ్

by srinivas |   ( Updated:2023-11-28 18:03:48.0  )
ఊపిరి పీల్చుకోగలిగాం.. ఉత్తర కాశీ టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్‌పై పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరఖాండ్‌లోని ఉత్తర కాశీ టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. టన్నెల్‌లో చిక్కకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. టన్నెల్ నుంచి కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తీసుకువస్తున్నారు. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. సొరంగం నుంచి కూలీలు క్షేమంగా బయటపడటం సంతోషదాయకమని చెప్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీలో సిల్ క్యారా సొంరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు క్షేమంగా బయటపడుతుండటంతో ఊపిరిపీల్చుకో గలిగామని చెప్పారు. ఆ కష్ట జీవులు క్షేమంగా బయటకు రావాలని, వారి కుటుంబ సభ్యుల కాదు.. ఎందరో ప్రార్థనలు చేశారని చెప్పారు. 41 మంది క్షేమంగా రావడం సంతోషదాయకమన్నారు. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, సహాయక బృందాలు, నిపుణులు 17 రోజుల పాటు ఎంతో శ్రమ తీసుకున్నారన్నారు. ర్యాట్ మోల్ మైనింగ్ కార్మికులు దిగ్విజయంగా తమకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చారని పేర్కొన్నారు. ఈ రెస్యూ ఆపరేషన్లలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పవన్ అభినందనలు తెలిపారు. ఓవైపు సహాయక చర్యలకు పలు మార్గాలు అన్వేషిస్తూనే సొరంగంలో చిక్కుకున్న వారికి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలమయ్యాయని పవన్ అభినందనలు తెలిపారు.

కాగా, ఉత్తరకాశీ సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు దాదాపు 17 రోజుల నుంచి సహయక చర్యలు జరుగుతున్నాయి. సొరంగంలో కూలిన శిథిలాలను భారీ యంత్రాలతో 58 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేసుకుంటూ రెస్క్యూ టీమ్స్‌ ముందుకు వెళ్లాయి. ర్యాట్ హోల్ పద్దతిలో రెస్య్కూ ఆపరేషన్ చేపట్టిన సహయక బృందాలు ఎట్టకేలకు ఇవాళ కార్మికుల ఉన్న ప్రదేశం వరకు డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్లారు. సొరంగంలో ఉన్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు 5గురు రెస్య్కూ టీమ్ సిబ్బంది టన్నెల్‌లోకి వెళ్లారు. కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తీసుకువస్తున్నారు. 41 మంది కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో కార్మికుల కుటుంబ సభ్యులు, అధికారులు అంతా ఊపీరి పీల్చుకున్నారు.



Advertisement

Next Story