- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Palnadu: 15 ఎకరాల అసైన్డ్ భూమికి ఎసరు...!
దిశ, పల్నాడు: అధికార యంత్రాంగం వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన వేళ పల్నాడులో ఎర్ర మట్టి దందా మొదలైంది. నకరికల్లు, రాజుపాలెం మండలాల్లోని పలుచోట్ల కొండ భూములు, మరికొన్నిచోట్ల అసైన్డ్ భూముల్లో అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతున్నారు. వందలాది వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అమ్ముకుంటున్నారు.
అసైన్డ్ భూమిలో భారీ గుంతలు..
రాజుపాలెం మండలంలోని బీరవల్లిపాయ, చౌటపాపాయపాలెం ఆర్‌అండ్‌ఆర్ సెంటర్ మార్గం మధ్యంలోని కొండ ప్రాంతంలో 15 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ ప్రాంతంలో అక్రమార్కులు ఎర్ర మట్టి తవ్వకాలను విచ్చలవిడిగా చేస్తున్నారు. యంత్రాలను ఏర్పాటు చేసి మరీ దోచుకుంటున్నారు. గతంలో ప్రభుత్వం ఈ అసైన్డ్ భూమి పంచిపెట్టగా, ఇంతవరకు ఎవరూ నివాసాలు ఏర్పాటు చేసుకోలేదు. చుట్టూ అటవీ భూమి కావడంతో, అక్కడ కూడా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానిక రైతులు చెబుతున్నారు. ఇప్పటికే అసైన్డ్ భూమిలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వర్షాలు పడిన సమయంలో ఆ గుంతల్లో నీరు చేరితే, ప్రమాదాలు జరుగుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేగంగా వాహనాల రాకపోకలు..
రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఎర్ర మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు అతివేగంగా రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదాలు సంభవిస్తాయని గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టి రవాణా చేసే పలు ట్రాక్టర్లకు కనీసం సరైన డాక్యుమెంట్స్ కూడా లేవని అంటున్నారు. పలువురు ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.