- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ గ్రామంలో రెచ్చిపోతున్న దొంగలు.. ఆందోళనలో ప్రజలు

దిశ, పల్నాడు: సత్తెనపల్లిలో దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా అందిన కాడికి దోచుకుంటున్నారు. నిన్న పట్టపగలు సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడులో వృద్ధురాలిని నిర్బంధించి రూ.లక్ష రూపాయల నగదును దోచుకున్నారు. అంతటితో ఆగకుండా తెల్లారేసరికి మరో రెండు దుకాణాల్లో సీసీ కెమెరాలను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. గత రెండు రోజులుగా వరుసగా జరుగుతున్న చోరీలతో సత్తెనపల్లి పరిసర ప్రాంతాల జనం హడలిపోతున్నారు.
తాజాగా గురువారం రాత్రి సత్తెనపల్లి పట్టణంలోని చెక్ పోస్ట్ దగ్గర ఉన్న రెండు దుకాణాల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. వేంకటేశ్వర రైతు సేవా కేంద్రం షర్టర్ తాళాలు పగులగొట్టి రూ.3,10,000 నగదును అపహరించారు. ఆ పక్కనే ఉన్న హీరో హోండా షోరూమ్ లో క్యాష్ కౌంటర్ ను పగలగొట్టి అందులో ఉన్న రూ.83 వేల నగదును చోరీ చేశారు. రెండు దుకాణాల్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేసి డివిఆర్ ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.