Breaking: మాచర్లలో ఉద్రిక్తత.. పోలీసులు వర్సెస్ బ్రహ్మారెడ్డి

by srinivas |   ( Updated:2023-04-17 17:24:22.0  )
Breaking: మాచర్లలో ఉద్రిక్తత.. పోలీసులు వర్సెస్ బ్రహ్మారెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాచర్ల వదిలి వెళ్లాలని జూలకంటి బ్రహ్మారెడ్డికి పోలీసులు ఆదేశించారు. ఎక్కడకు వెళ్లాలంటూ పోలీసులతో బ్రహ్మారెడ్డి వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు బ్రహ్మారెడ్డి ఇంటికి భారీగా చేరుకుంటున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే బ్రహ్మారెడ్డిని వెళ్లిపోవాలంటున్నారని మండిపడుతున్నారు. పోలీసులు తీరు మార్చుకోవాలని కోరుతున్నారు.

గతంలోనూ మాచర్ల రణ రంగంగా మారింది. టీడీపీ, వైసీపీ వర్గీయులు దాడుల చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. పలు వాహనాలు ఆగ్నికి ఆహుతయ్యాయి. టీడీపీ నేత బ్రహ్మారెడ్డి ‘రాష్ట్రానికి ఇదేం ఖర్మ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బ్రహ్మారెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఆ సమయంలో బ్రహ్మారెడ్డితో పాటు 10 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Advertisement

Next Story