- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Political Hightention: తెనాలిలో ఆర్యవైశ్యుల అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్: తెనాలి మున్సిపల్ కౌన్సిలో జరిగిన ఘటన ఆర్యవైశ్య కులానికి తగిలింది. తమ కౌన్సిలర్‌పై దాడిని ఖండిస్తూ ఆర్యవైశ్యులు రోడ్డెక్కారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమరణ దీక్షకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అర్యవైశ్యుల దీక్షను భగ్నం చేశారు. పలువురిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అటు టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు కూడా రోడ్లపైకి వచ్చారు. నిరసన వ్యక్తం చేశారు. దీంతో తెనాలిలో పొలిటికల్ హైటెన్షన్ కొనసాగుతుంది.
కాగా తెనాలి మున్సిపల్ సమావేశంలో వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు కొట్టుకున్నారు. ముష్టియుద్ధానికి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కౌన్సిలర్లు పరస్పరం తరుముకుంటూ వెళ్లి మరీ కొట్టుకున్నారు. అడ్డుకున్నా వదల్లేదు. కౌన్సిలర్లు అమ్మనా బూతులు తిట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సమావేశంలో ఇరువురుని చెదరగొట్టిన మున్సిపల్ చైర్మన్ అనంతరం సమావేశం నుంచి వెళ్లిపోయారు.