- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MLC Yesuratnam: నా ప్రమోషన్‌ను చంద్రబాబు అడ్డుకున్నారు
దిశ, డైనమిక్ బ్యూరో: తనకు ఐజీ ప్రమోషన్ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం ఆరోపించారు. రాజకీయాల్లో రావెల కిషోర్ బాబు, వర్ల రామయ్యలకు ఎదుగుదల లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ సింగిల్‌గా వచ్చినా.. పొత్తులతో వచ్చినా 175 స్థానాల్లో వైసీపీ గెలుపొందడం ఖాయమని యేసు రత్నం ధీమా వ్యక్తం చేశారు. ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద పోలీసు అధికారిగా విధులు నిర్వహించిన తాను డీఐజీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో వడ్డెర సామాజిక వర్గం నుంచి మొట్టమొదటిగా మండలిలో అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు యేసురత్నం ధన్యవాదాలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల సమస్యల కోసం మండలిలో తన గళాన్ని వినిపిస్తానని చెప్పారు. రాబోయే ఎన్నికలు ధనవంతులకు బలహీన వర్గాల మధ్య జరుగుతున్న రాజకీయ పోటీ అని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపుకోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తామని యేసురత్నం వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
బ్రేకింగ్: స్క్రిప్ట్ తిరగరాశారు.. వైసీపీ రెబల్స్‌పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు