Bulldozer Action : సంభల్ ఎంపీ ఇంటిపై బుల్డోజర్ యాక్షన్

by Hajipasha |   ( Updated:2024-12-20 15:37:10.0  )
Bulldozer Action : సంభల్ ఎంపీ ఇంటిపై బుల్డోజర్ యాక్షన్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌‌లోని సంభల్‌‌(Sambhal)కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియా‌వుర్ రహ్మాన్ బర్ఖ్(Zia Ur Rehman Barq) చుట్టూ యోగి సర్కారు ఉచ్చు బిగిస్తోంది. శుక్రవారం రోజు ఆయనకు షాకిచ్చే రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారనే అభియోగాలతో గురువారం రోజు ఎంపీ జియా‌వుర్ రహ్మాన్, ఆయన తండ్రి మౌలానా మమ్లూకుర్ రహ్మాన్ బర్ఖ్‌లపై కేసు నమోదైంది. దానికి సంబంధించి జియా‌వుర్ రహ్మాన్‌పై యూపీ విద్యుత్ శాఖ రూ.1.91 కోట్ల జరిమానా విధించింది. సంభల్‌ పట్టణంలోని దీప్​ సరాయ్ ఏరియాలో ఉన్న ఆయన ఇంటికి విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు.

ఈవివరాలను యూపీ విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం వెల్లడించారు. విద్యుత్ మీటర్లను తనిఖీ చేసేందుకు ఇంటికి వెళ్లిన ఇద్దరు జూనియర్ ఇంజినీర్లను బెదిరించారనే అభియోగాలను ఎంపీ తండ్రి మౌలానా మమ్లూకుర్ రహ్మాన్ బర్ఖ్‌పై నమోదు చేశామన్నారు. దీంతోపాటు ఎంపీ జియా‌వుర్ రహ్మాన్ బర్ఖ్ ఇంటి బయట అక్రమంగా నిర్మించిన ఒక కట్టడాన్ని కూడా బుల్డోజర్ల(Bulldozer Action)తో కూల్చివేశారు. భారీ పోలీసు భద్రత నడుమ ఈ కూల్చివేత ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు.

Next Story

Most Viewed