AP Capital Issue: నారా లోకేశ్ ఎదుట ఉండవల్లి శ్రీదేవి కంటతడి

by srinivas |   ( Updated:2023-08-13 14:27:14.0  )
AP Capital Issue: నారా లోకేశ్ ఎదుట ఉండవల్లి శ్రీదేవి కంటతడి
X

దిశ, వెబ్ డెస్క్: రాజధాని రైతులతో నారా లోకేశ్‌ భేటీ అయ్యారు. ఈ భేటీలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధానిపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు వద్దని...అమరావతి ముద్దని శ్రీదేవి తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన ఉందని.. మహిళలను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని లేని నగరానికి ఎమ్మెల్యేనని అందరూ తనను చూసి నవ్వుతున్నారని నారా లోకేశ్ ఎదుట శ్రీదేవి కంటతడి పెట్టారు. ఇకపై తన భరోసా మొత్తం నారా లోకేశ్‌దని స్పష్టం చేశారు. అమరావతి రైతులను ప్రభుత్వం చాలా వేధించిందని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఉండవల్లి శ్రీదేవి ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు. దీంతో చంద్రబాబును కలిసి టీడీపీలో చేరతామని ఆమె తెలిపారు. తాజాగా నారా లోకేశ్ పాదయాత్రలో శ్రీదేవి పాల్గొని ఏపీ రాజధాని అమరావతికి మద్దతు తెలిపారు.

Read more :

పవన్! అప్పుడు నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా?: మంత్రి రోజా

Next Story

Most Viewed