- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking: త్వరలో ఏపీలో అధికార వికేంద్రీకరణ.. క్లారిటీ ఇచ్చిన సజ్జల
దిశ, వెబ్ డెస్క్: అమరావతి ఆర్5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఏ పార్టీ అయినా సపోర్ట్ చేయాలని తెలిపారు. ప్రభుత్వానికి దఖలు పడిన భూమిని పేదలకు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రతిపక్షాల తీరు చాలా అన్యాయంగా ఉందన్నారు. రైతుల వెనుక ఎవరున్నారో ప్రతిఒక్కరికీ తెలుసన్నారు. పేదలు లేకుండా, శ్రామికులు, కార్మికులు లేకుండా ఏ నగరమైనా ఉంటుందా?. అని సజ్జల ప్రశ్నించారు. పూర్తిగా స్వార్థం, రాజకీయ, ఆర్థిక అవసరాలను ఆశించే అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో అధికార వికేంద్రీకరణ జరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. కోర్టుకు వెళ్లింది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అని ఎద్దేవా చేశారు. వీళ్లందరికీ నాయకత్వం వహిస్తున్నది పెద్ద రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంద్రబాబేనని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. గుడిలో లింగం, మట్టి అన్నీ మింగేయాలని చంద్రబాబు ప్లాన్ చేశారని ఆరోపించారు. రాజకీయ పార్టీగా టీడీపీ అర్హత కోల్పోయినట్టేనన్నారు.
Also Read..
Somireddy: భాస్కర్‌రెడ్డి జైల్లో ఉంటే అవినాశ్‌రెడ్డి బయట ఉండటమేంటి?